News January 29, 2026

NRPT: కంట్రోల్ రూమ్ నంబర్ ఇదే..!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా నారాయణపేట కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154283913 కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News

News February 17, 2026

వంగలో కాయకుళ్లు తెగులు – నివారణ

image

ఈ తెగులు సోకిన వంగ మొక్కల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మాడి రాలిపోతాయి. కాయలు పసుపు రంగుకు మారి కుళ్లిపోతాయి. నివారణకు నారు మడిలో విత్తేముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.

News February 17, 2026

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>భారత్ <<>>ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ SBU 12 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech/BSc(Engg.)అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి నుంచి మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://bel-india.in

News February 17, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19164014>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం నుంచి రూ.2240 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,050 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.