News November 27, 2025

NRPT: కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్‌ను పరిశీలించిన పరిశీలకురాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని నారాయణపేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆమెకు స్వాగతం పలికారు.

Similar News

News November 28, 2025

మెట్రో ప్రయాణికులకు స్మార్ట్ లాకర్ల సేవలు

image

​L&T మెట్రో రైల్, TUCKITతో కలిసి HYDలోని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సేవలను ప్రారంభించింది. ఇందులో లగేజీ, హెల్మెట్‌లు, షాపింగ్ బ్యాగ్‌లను భద్రపరుచుకుని హ్యాండ్స్‌ఫ్రీగా ప్రయాణించొచ్చు. QR కోడ్ స్కాన్ చేసి, లాకర్ సైజు ఎంచుకుని 30 సెకన్లలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్‌సిటీ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

News November 28, 2025

BREAKING.. ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని ఓ రైతు నుంచి తహశీల్దార్ మహేందర్ రూ.15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

చింతపల్లి: చిలకడదుంపలకు పెరిగిన గిరాకీ

image

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగవుతున్న చిలకడ దుంపలకు ఈ ఏడాది గిరాకీ ఏర్పడింది.
ఈ రెండు మండలాల్లో 200 ఎకరాల్లో ఈ పంట సాగావుతోంది. ఎకరాకు ₹25,000 పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.25000 ఆదాయం వస్తోందని అంటున్నారు. గతఏడాది బస్తా (80kg) రూ.800 కాగా ఈ ఏడాది రూ.1200కు పెరిగింది. దీనితో గిరి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇక్కడ పండిన పంట రాజమండ్రి, విజయవాడ, బెంగుళూరు మార్కెట్లకు వెళుతోంది.