News December 30, 2025

NRPT: ‘కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు వేయాలి’

image

మాదకద్రవ్యాల అనర్థాలపై యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మాదకద్రవ్యాల నిషేధ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని, కళాశాలల్లో తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Similar News

News January 1, 2026

గన్నేరువరం: మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండలం కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడ్డారు. అమ్మవార్లను దర్శించుకుని పెద్ద సంఖ్యలో ముడుపులు సమర్పించారు.

News January 1, 2026

ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగర్‌ కర్నూల్ కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిట్‌ నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జనవరి 1-31 వరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

News January 1, 2026

జల వివాదాలపై చర్చకు సర్కార్ సిద్ధం!

image

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో BRSను ఎదుర్కోవడంపై సీఎం రేవంత్ సహా మంత్రులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలనేదానిపై నేతలకు సీఎం కూడా దిశానిర్దేశం చేశారు.