News August 9, 2025

NRPT: ‘కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి’

image

ప్రభుత్వ కార్యాలయాలు, గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి అల్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు.

Similar News

News August 10, 2025

అనకాపల్లి: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

గంజాయి మత్తులో వృద్ధురాలిని రాయితో కొట్టి చంపిన ఘటనలో నిందితుడు కుదర పవన్ సాయిని కే.కోటపాడు సీఐ అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించారని చీడికాడ ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున చీడికాడ(M) ఎల్బీ పట్నానికి చెందిన గండి పైడితల్లమ్మ అనే వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన పవన్ సాయి రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.

News August 10, 2025

ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. ట్విస్ట్ ఏంటంటే?

image

ఛత్తీస్‌గఢ్‌లో మనీశ్‌ అనే యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్ చేశారు. అతడు వాడుతున్న మొబైల్ నంబర్ గతంలో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఉపయోగించడమే కారణం. 6 నెలలపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో నంబర్‌ను మనీశ్‌కు కేటాయించింది కంపెనీ. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో యువకుడి నుంచి సిమ్ తీసుకొని రజత్ పాటీదార్‌‌కు అప్పగించారు. తాను కోహ్లీ ఫ్యాన్ అని మనీశ్ చెప్పడం విశేషం.

News August 10, 2025

79 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

image

అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి 79 అడుగుల జాతీయ జెండాతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విశ్వవిద్యాలయం తరుపున హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.