News March 18, 2025
NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 18, 2025
‘అర్జున్ రెడ్డి’ మూవీలో ఇప్పుడు నటిస్తారా? హీరోయిన్ స్పందనిదే

‘అర్జున్ రెడ్డి’లో తన పాత్ర బలహీనంగా ఉంటుందని షాలినీ పాండే అభిప్రాయపడ్డారు. అలాంటి మూవీలో ఇప్పుడు నటిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘కచ్చితంగా నటిస్తా. కానీ డైరెక్టర్‌తో కొన్ని మార్పులు చేయించుకుంటా. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడంతో అమాయకంగా ఉండేదాన్ని. ఇప్పుడు బలమైన క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. ఇటీవల ఆమె ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్‌లో నటించారు.
News March 18, 2025
రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 18, 2025
కృష్ణా: పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు- కలెక్టర్

కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.