News October 25, 2025

NRPT: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శనివారం ప్రారంభించారు. స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించిన ఆమె, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

ప్రతీ ఆలయాన్ని దీపాలతో అలకరించాలి: మంత్రి కొండా

image

కార్తీక దీపోత్సవాన్ని కనుల పండగలా నిర్వహించాలని, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక దీపోత్సవం 22.10.2025 నుంచి 19.11.2025 వరకు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

News October 25, 2025

సురక్షా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్షా యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్షా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 25, 2025

చిత్తూరు: సోలార్ ప్లాంట్ల టెండర్లకు ఆమోదం..!

image

జిల్లాలో <<18100873>>సోలార్ ప్లాంట్ల<<>> టెండర్లు ఖరారయ్యాయి. SPDCL SE ఇస్మాయిల్ అహ్మద్ పర్యవేక్షణలో కుప్పం, చిత్తూరు డివిజన్‌లో ప్లాంట్ పనులు 2026 MAR. ఆఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు పగలే నిరంతరాయంగా 9 గం. విద్యుత్ సరఫరా అందనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 ఖర్చు కానుండగా సోలార్ విద్యుత్‌తో ఆ ధర రూ.3.20కు దిగి రానుంది.