News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News November 4, 2025
GNT: బ్యాడ్ న్యూస్.. ఈసారి లేనట్టే..!

బాపట్ల సూర్యలంక బీచ్‌ను నవంబర్ 4, 5 తేదీలలో (మంగళవారం, బుధవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. తుఫాను సముద్రంలో ఏర్పడిన చిన్న చిన్న గుంటల కారణంగా సంబంధిత శాఖల అధికారుల రిపోర్టుల ఆధారంగా భక్తులు, పర్యాటకులను అనుమతించమన్నారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలకు కార్తీక పౌర్ణమికి ఈసారి సముద్ర స్నానం లేనట్టే..!
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.
News November 4, 2025
రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<


