News January 4, 2025

NRPT: చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రిమాండ్: డీఎస్పీ

image

నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Similar News

News January 6, 2025

మహబూబ్‌నగర్‌: ఉరేసుకుని ఇద్దరి ఆత్మహత్య

image

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్‌కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్‌కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

News January 6, 2025

మహబూబ్‌నగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

ఉమ్మడి MBNR జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

News January 6, 2025

NGKL: పెళ్లి చూపులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో జరిగిన <<15075870>>రోడ్డు <<>>ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మండలం తాండ్రకి చెందిన రామకోటి (32), వెల్దండ మండలం కొట్రకు చెందిన గణేశ్ (34)తో కలిసి పెళ్లి చూపుల కోసం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో కారు నుజ్జునుజ్జు అయి అందులో ఇరుక్కుని స్పాట్‌లో చనిపోయారు. కేసు నమోదైంది.