News March 22, 2025

NRPT: జలం ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు..!

image

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవ సందర్భంగా వినూత్నంగా జల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలవనులను ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు.. అంటూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి? నీటిని వృథా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీచర్స్ పాల్గొన్నారు.

Similar News

News December 14, 2025

విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.

News December 14, 2025

BREAKING: యాదాద్రి జిల్లాలో సర్పంచ్ ఎన్నిక తొలి ఫలితం

image

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నీలా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు శాంతి రమేశ్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 62 ఓట్ల మెజారిటీతో బానోతు శాంతి రమేశ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

News December 14, 2025

లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్‌గా నీలం చంద్రారెడ్డి గెలుపు

image

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.