News January 22, 2025
NRPT: జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో సమావేశంలో SP యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది 250 వరకు రోడ్డు ప్రమాదాలు జరగాయని, అందులో 102 మంది చనిపోయారన్నారు. సమన్వయంతో ప్రమాదాలు నివారించాలన్నారు.
Similar News
News July 6, 2025
ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.
News July 6, 2025
CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. <
News July 6, 2025
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత పరిశీలన

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, వాష్ రూమ్స్, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. పరిశుభ్రతపై తనిఖీ చేసేందుకు బృందాలు త్వరలోనే పర్యటించనున్నారు. జిల్లాలో 1,108 పాఠశాలలో ఉండగా, 82,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.