News December 29, 2025

NRPT: జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

నారాయణపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరా కొనసాగుతోందని ఇంచార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ప్రకటనలో చెప్పారు. జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, వివిధ పంపిణీ కేంద్రాల్లో 1009 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. యూరియా సరఫరా సజావుగా జరుగుతున్నదని చెప్పారు.

Similar News

News December 29, 2025

ఖమ్మం: కబ్జాదారులకు పొంగులేటి వార్నింగ్

image

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వివాదాల్లో ఉన్న భూముల రక్షణకు న్యాయపరంగా గట్టిగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు.

News December 29, 2025

మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

image

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.

News December 29, 2025

విశాఖ పోర్ట్‌ తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరాంజి

image

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్‌గా, కేంద్ర డిప్యూటేషన్‌లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.