News March 1, 2026

NRPT జిల్లాలో 65 శాతం దాటిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ

image

NRPT జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 65.03 శాతం పూర్తయ్యింది. మొత్తం 1,84,713 మంది పట్టాదారుల్లో 1,20,120 మంది ఇప్పటికే నమోదు చేసుకోగా, ఇంకా 64,593 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,59,000 ఎకరాల భూమి ఉండగా, అందులో 4,25,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఫార్మర్ ఐడీ ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాల లబ్ధి వర్తించనుందని డీఏవో జాన్ సుధాకర్ తెలిపారు.

Similar News

News March 7, 2026

ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోలు.. గణపతి ఉంటారా?

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్‌జీ సహా కీలక నేతల గన్‌మెన్లు, అనుచరులు లొంగిపోనున్నారు.

News March 7, 2026

విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.. పేలని గన్!

image

విజయవాడలో శనివారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు బుల్లెట్ రాలేదు. అప్రమత్తమై దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక 9mm పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

image

జనగామ జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం నెల్లుట్ల గ్రామ పంచాయతీని సందర్శించిన ఆయన, చెరువు గట్టు వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.