News February 17, 2025

NRPT జిల్లా ఏర్పడి నేటికీ ఆరేళ్లు పూర్తి.!

image

నారాయణపేట కొత్త జిల్లాగా ఏర్పడి నేటికీ ఆరేళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 13 మండలాలు, 280 గ్రామ పంచాయతీలలో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన జిల్లా ఏర్పాటు కోసం జిల్లా సాధన సమితి పేరుతో అనేక రకాలుగా ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రకటించింది.

Similar News

News December 11, 2025

పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలి: MP లావు

image

AP: రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను MP లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కేంద్రం AP పత్తి రైతులను ఆదుకోవాలి. ‘మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమశాతం ఎక్కువగా ఉన్న, రంగు మారిన పత్తిని కూడా CCI కొనుగోలు చేసేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది.

News December 11, 2025

మెట్‌పల్లి: ఏఎస్ఆర్ తండా సర్పంచ్‌గా సురేందర్

image

మెట్‌పల్లి మండలంలోని అల్లూరి సీతారామరాజు తండా సర్పంచ్‌గా గుగులావత్ సురేందర్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి గుగులావత్ గంగాదాసుపై కేవలం 16 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇక్కడ సర్పంచ్ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాగా ఇక్కడ ఉన్న ఆరు వార్డులు ఇదివరకే ఏకగ్రీవమయ్యాయి. ఇది తక్కువ ఓటర్లు ఉన్న గ్రామపంచాయతీ. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామప్రజలకు సురేందర్ ధన్యవాదాలు తెలిపారు.

News December 11, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.