News March 23, 2025
NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.
News March 24, 2025
5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని తెలిపారు.