News December 27, 2025

NRPT జిల్లా స్థాయి INSPIRE & సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ

image

జిల్లా స్థాయి INSPIRE ప్రదర్శన (2024–25)ను జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ (2025–26)తో కలిపి నిర్వహించనున్నారు. INSPIREలో జిల్లా స్థాయికి ఎంపికైన 19 ప్రాజెక్టులతో విద్యార్థులు పాల్గొననుండగా, ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనేలా హెడ్మాస్టర్లు, గైడ్ టీచర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందు రాజులు తెలిపారు.

Similar News

News December 28, 2025

సొంత పార్టీలో ‘దిగ్విజయ్’ చిచ్చు!

image

దిగ్విజయ్ సింగ్ చేసిన RSS అనుకూల <<18686086>>వ్యాఖ్యలపై<<>> సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థుల బలాన్ని విశ్లేషించడం తప్పు కాదంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలిస్తే.. ‘గాడ్సే’ని నమ్మేవాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్త PM అవ్వడం BJPలోనే సాధ్యమని దిగ్విజయ్ నిన్న పోస్ట్ చేశారు.

News December 28, 2025

నిజామాబాద్: హార్ట్ బ్రేకింగ్.. ఏ తల్లి కన్నబిడ్డో..!

image

నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను గోదారమ్మ సాక్షిగా కాలగర్భంలో కలిపేసింది. నవీపేట్ మండలం యంచ గ్రామ పరిధిలోని గోదావరి నదిలో స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్న ఈరోజుల్లో ఓ తల్లి ఇలా చేయడం స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

News December 28, 2025

‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న మోసాల పట్ల వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలను హెచ్చరించింది. సీబీఐ, పోలీస్ అధికారులమని నమ్మిస్తూ వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్టపరంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియ లేదని, ఇలాంటి కాల్స్ వస్తే భయపడకూడదని స్పష్టం చేశారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.