News January 11, 2026
NRPT: ‘డయల్ యువర్ ఎస్పీని సద్వినియోగం చేసుకోండి’

సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు బాధితులు 08506-281182 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా వివరించవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2026
260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News February 6, 2026
రాజన్న ఖజానాకు రూ.కోటి 72 లక్షలు పైగా ఆదాయం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 72 లక్షల 76 వేల 469 ఆదాయం సమకూరింది. 13 రోజుల వ్యవధిలో భక్తులు భీమేశ్వరాలయంలో సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 72 లక్షల 76 వేల 469 నగదు, 75 గ్రాముల 300 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 800 గ్రాములు మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు.


