News October 3, 2025
NRPT: నామినేషన్ దాఖలకు అవసరమైన పత్రాలు ఇవే..

ZPTC, MPTC మొదటి విడత ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రంతో పాటు, ఓటర్ గుర్తింపు, ఎన్నికల డిపాజిట్ రసీదు, 3 పాస్‌పోర్టు ఫొటోలు సమర్పించాలి. పార్టీ అభ్యర్థుల అయితే బీఫామ్ తప్పనిసరి జతచేయాలి. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల ధ్రువపత్రంపై గెజిటెడ్ సంతకం చేయించి జత చేయాలి. ఎన్నికల వ్యయం నిర్వాహకునకు కొత్త బ్యాంకు ఖాతా ఆర్వోకు సమర్పించాలి.
Similar News
News October 3, 2025
తిరుపతిలో ఎంతమంది అర్హులు ఉన్నారంటే…!

‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,757 ఆటో డ్రైవర్లు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగా.. వీటిని పరిశీలించిన అధికారులు 14,375 అప్లికేషన్లను మంజూరు చేశారు. వివిధ కారణాలవల్ల 249 దరఖాస్తులను తిరస్కరించగా.. 133 హోల్డ్ లో పెట్టారట. అటు చిత్తూరు జిల్లాలో 6,777 మందికి మంజూరైనట్లు తెలుస్తోంది. అర్హులకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నారు.
News October 3, 2025
భయభ్రాంతులకు గురికావద్దు: తిరుపతి SP

అపోహలు, ఊహాగానాలను నమ్మవద్దని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దన్నారు.
News October 3, 2025
ఈనెల 7న నారావారిపల్లెకు CM

ఈనెల 7న సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు రానున్న సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు విస్తరి కార్యక్రమం ఈనెల 7వ తేదీన నారావారిపల్లెలో జరగనుంది. కాగా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి రానున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు.