News September 4, 2025

NRPT: నామినేషన్ ప్రక్రియపై అవగాహన

image

నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సంబంధిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ తెలిపారు. 2025 2026 విద్యా సంవత్సరానికి గానీ ఇన్స్పైర్ అవార్డుల కోసం https://www.inspireawards-dst.govt.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. పాఠశాలకు 5 నామినేషన్లు నమోదు చేయాలన్నారు.

Similar News

News September 7, 2025

విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే..!

image

విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో అయితే రూ.230కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపల్లో బొచ్చ రూ.230, రాగండి రూ.200గా విక్రయిస్తున్నారు. 30 కోడిగుడ్లు రూ.170కి అమ్ముతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 7, 2025

మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 7, 2025

ఖమ్మం: ప్రేమ నిరాకరించిందని.. యువకుడి SUICIDE

image

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాలిలా.. మునిగేపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సిద్ధు(25) ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను కాదనడంతో మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధు తండి హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.