News August 12, 2024

NRPT: నేడు పాఠశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ నిర్వహించాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిజ్ఞ చేసిన చిత్రాలు, వీడియోలను విద్యాశాఖ అధికారులకు పంపించాలని, https:// nmba.dosje.gov.in/pledge-certificate ద్వారా ధృవపత్రం పొందాలన్నారు.

Similar News

News November 5, 2025

నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 5, 2025

పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

image

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.