News August 7, 2025

NRPT: నేసినది కాదిది… సంప్రదాయాన్ని మోసిన చీర ఇదీ!

image

124 ఏళ్లకు పైగా చరిత్ర.. దేశవ్యాప్తంగా గుర్తింపు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెచ్చిన చీరలే NRPT చీరలు. కోటకొండ వాసి యంగలి వెంకట్రాములు మగ్గంపై కుట్టులేని జాతీయ పతాకం నేసి ఘనత పొందారు. రుద్రాక్ష, కోటకొమ్మ, నివాళి, శంభు బార్డర్లు యువతకూ నచ్చేలా మారుస్తున్నారు. పేట పట్టు, కాటన్‌ చీరలకు ఎంతో ఫేమస్. జిల్లాలో 5 వేలకు పైగా నేతన్నలుండగా, 735 మగ్గాలకు జీయో ట్యాగింగ్‌ పూర్తైంది.
#నేడు జాతీయ చేనేత దినోత్సవం

Similar News

News August 7, 2025

విశాఖలో ఏపీఎల్.. ప్రవేశాలు ఉచితం

image

విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు విశాఖ ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్ వ్యవహించనున్నారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీచరణ్ పాకాల లాంటి వారు పాల్గొననున్నారు. అన్ని మ్యాచులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏసీఏ ప్రతినిధులు ప్రకటించారు.

News August 7, 2025

ఎల్బీనగర్‌: BJPని TGలో నామరూపాలు లేకుండా చేస్తాం: కోట్ల

image

కాంగ్రెస్ దొంగ ధర్నాలతో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా నాటకం ఆడుతుందని, రిజర్వేషన్లు ఇస్తే తీసుకుంటాం లేకుంటే గుంజుకుంటామని గురువారం ఎల్బీనగర్‌లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుడు కోట్ల వాసుదేవ్ విమర్శించారు. BJP కూడా ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు ఇవ్వకుండా పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వకుంటే BJPని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

News August 7, 2025

వరంగల్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో వరంగల్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.