News December 26, 2025

NRPT: న్యూయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వినీత్ తెలిపారు.
✓అనుమతి లేని పార్టీల నిర్వహణ నిషేధం.
✓ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి తప్పనిసరి.
✓కేక్ కట్టింగ్ కార్యక్రమాలపై కూడా పరిమితులు ఉంటాయని చెప్పారు.
✓డీజేలు, భారీ సౌండ్ బాక్సులతో శబ్ద కాలుష్యం సృష్టించడం నిషేధమన్నారు.
✓నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు.
✓యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.

Similar News

News January 1, 2026

నాబార్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

NABARDలో 17 స్పెషలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ(కామర్స్/మ్యాథ్స్/ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ఫైనాన్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ/PGDBA/PGDM, CA/ICWA, ME, BCA, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org

News January 1, 2026

గుడ్ న్యూస్.. ఆ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

image

AP: న్యూఇయర్ వేళ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 రకాల భూములను 22-A(నిషేధిత) భూముల జాబితా నుంచి తొలగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. స్వాత్రంత్ర్య సమరయోధులు, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులకు సరైన భూమి పత్రాలుంటే లిస్ట్ నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News January 1, 2026

Dec 31st.. బిర్యానీతో పాటు ఆశ్చర్యపరిచే ఆర్డర్లు

image

దేశవ్యాప్తంగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డెలివరీ యాప్‌లలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఎప్పటిలాగే బిర్యానీ టాప్‌లో నిలిచినా, ఈసారి కొన్ని ఆర్డర్లు ఆశ్చర్యపరిచాయి. ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్‌లు, ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు సైతం పలువురు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. స్విగ్గీ నుంచి ఒక్క రోజే 2 లక్షలకు పైగా బిర్యానీలు, లక్షకు పైగా బర్గర్లు డెలివరీ అయ్యాయి.