News March 30, 2025

NRPT: ‘పండగలు శాంతియుతంగా చేసుకోవాలి’

image

పండుగలు కులమతాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ప్రకటనలో అన్నారు. జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను ప్రజలంతా ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని అన్నారు. తీపి, చేదు, కష్ట సుఖాలు తెలిసిందే జీవితమని అన్నారు. పండగలకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Similar News

News November 10, 2025

గట్టు: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం-MLA బండ్ల

image

పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గట్టు మండలం ఆరగిద్దలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి 3 ఇళ్లు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో పేదలు సొంతిల్లు నిర్మించుకునే అవకాశం లభించిందన్నారు. మాజీ ఎంపీపీ విజయ్ పాల్గొన్నారు.

News November 10, 2025

గొల్లప్రోలు: కుక్క కాటుతో బాలుడి మృతి

image

గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు భరత్ కుక్కకాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నెల రోజుల క్రితం కుక్క కరవడంతో బాలుడికి 4 డోసులు రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. నిన్న అకస్మాత్తుగా నీరసంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 10, 2025

ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

image

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.