News March 21, 2025

NRPT: పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు

image

నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు కాగా, 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు చెప్పారు. పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారని అన్నారు.

Similar News

News July 6, 2025

కోటపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

image

కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.

News July 6, 2025

HYD: జవాన్ల కోసం 3D ప్రింటింగ్ భవనం

image

సివిల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ రోజు రోజుకు నూతన పుంతలు తొక్కుతోంది. దేశంలోని తొలిసారి జవాన్ల కోసం మధ్యప్రదేశ్ గాల్వియర్‌లో 3D ప్రింటింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో మన IIT హైదరాబాద్ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఏకంగా సుమారు 14 మంది జవాన్లు నివసించే అవకాశం ఉంటుంది. సాధారణ నిర్మాణాలు సాధ్యం కాని ప్రాంతాలలో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.

News July 6, 2025

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2.50 లక్షల ఇళ్ల పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. కొత్తగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైనా, ఇళ్లు రానివారు నిరుత్సాహపడొద్దన్నారు. రాబోయే రోజుల్లో మిగతావారికి విడతలవారీగా కేటాయిస్తామని తెలిపారు. BRSలా ఊహజనిత మాటలు తాము చెప్పబోమన్నారు.