News February 25, 2026

NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

image

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.

Similar News

News March 1, 2026

మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 1, 2026

పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

image

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.

News March 1, 2026

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో రబీ సీజన్‌కు మార్చి 21 వరకు 8,339 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పాక్స్‌లలో 1,573 ఎం.టన్నులు, రైతు సేవ కేంద్రాల్లో 714, డీసీఎంఎస్‌లో 214, ప్రైవేట్ రిటైల్ వద్ద 2,298, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 3,208 ఎం.టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50 మాత్రమేనని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.