News February 24, 2026
NRPT: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు జరిగే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలని చెప్పారు. విద్యార్థులు, సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని సూచించారు.
Similar News
News February 27, 2026
సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.
News February 27, 2026
రాష్ట్రంలో పరువు హత్య.. దారుణంగా చంపేశారు

AP: తూ.గో జిల్లా ద్వారపూడిలో పరువు హత్య కలకలం రేపింది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు(41) నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య సోదరులు ద్వారపూడి వెళ్లి బైక్‌పై వస్తున్న నూతన దంపతులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో సూర్యప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత స్థానికులు నిందితులను చితకబాది, పోలీసులకు అప్పగించారు.
News February 27, 2026
GREAT.. ‘ఆర్ఎంసీ’లో భూపాలపల్లి సౌమ్య ప్రతిభ

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. ఈ విజయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


