News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమర్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
Similar News
News July 4, 2025
GWL: ‘సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. గంట వీధికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు లింక్ పంపి అందులో చేరితే లాభాలు వస్తాయని నమ్మించి రూ.4.29 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.50 వేలు, సెకండ్ రైల్వే గేట్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.2.64 లక్షలు, నదీ అగ్రహారానికి చెందిన వ్యక్తికి లోన్ ప్రాసెస్ చేస్తామని రూ.40 వేలు దోచే యత్నం చేయగా ఖాతాలు ఫ్రీజ్ చేశామన్నారు.
News July 4, 2025
తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలి: BHPL కలెక్టర్

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ హాలులో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు.
News July 4, 2025
మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.