News November 18, 2025
NRPT: పొగమంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ

చలికాలం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని, వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు చెప్పారు. హెడ్ లైట్లను బీమ్‌లో ఉంచి ఫాగ్ లైట్లు వాడాలని సూచించారు. ఏకాగ్రతతో వాహనాలు నడిపించాలని చెప్పారు.
Similar News
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
News November 18, 2025
కడపలో సీఎం పర్యటన ఇలా.!

రేపు పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన PM కిసాన్, అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి CM చంద్రబాబు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.
☛ 1:25PM: పెండ్లిమర్రి (M) వెల్లటూరులోని హెలిప్యాడ్ వద్దకు వస్తారు
☛ 1:40 PM-4 PM: ప్రజావేదికలో ప్రసంగం
☛ 4:20 PM-5:05 PM: రైతులతో మాట్లాడతారు
☛ 5:15 PM- 6:15 PM: కార్యకర్తలతో మీటింగ్
☛ 6:50 PM: విజయవాడకు తిరుగు పయనమవుతారు.


