News April 11, 2025

NRPT: ‘పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి’

image

పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గర్భిణీలు, బరువు తక్కువగా ఉన్న పౌష్టికాహారం అందించాలన్నారు.

Similar News

News September 19, 2025

ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

image

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.

News September 19, 2025

దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

image

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.