News March 17, 2025
NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 1, 2026
VKB: బీమాపై అవగాహన కరవు.. నష్టాల్లోకి పశుపోషకులు

వికారాబాద్ జిల్లాలో రైతులు పశు బీమా కోసం అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,99,354 పశువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పశువులకు సంబంధించి బీమా లేకపోవడంతో రైతులు, పశుపోషకులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. పశు బీమాపై పలువురు రైతులకు అవగాహన లేకపోవడంతోనే నష్టాలను చవిచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అవగాహన కల్పించి బీమా సౌకర్యం కల్పిస్తే ఎంతగానో మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.
News March 1, 2026
RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.
News March 1, 2026
అమరాపురంలో బొలేరో బోల్తా.. ప్రమాదంలో 12 మంది

అమరాపురంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తముడేపల్లి గ్రామ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. 12 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రోళ్ల మండలం HT.హళ్లి గ్రామంలో నామకరణ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


