News July 7, 2025
NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
కరీంనగర్: విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారి తొలగింపు

కరీంనగర్ మండల విద్యాధికారి కే.భద్రయ్య తన విధుల పట్ల పలుమార్లు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపడమే కాకుండా పైఅధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ వీణవంక మండలంలోని ఎల్బక జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఎం.అంజా రెడ్డికి కరీంనగర్ మండల విద్యా అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
News July 8, 2025
కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.
News July 8, 2025
ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యా చందనతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శారీరక వికలాంగుడు రాహుల్‌కు ఉపాధి, అనసూర్యకు ఇళ్లు, వెంకటేశ్వర్లుకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు.