News October 14, 2025

NRPT: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

image

అక్టోబరు 21న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలలో ఔత్సాహికులు పాల్గొనాలని ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో కోరారు. పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపే పోటోలు, వీడియోలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని పీఆర్వో వెంకట్‌కు అందించాలని సూచించారు. వివరాలకు 87126 70380 నంబరును సంప్రదించవచ్చు.

Similar News

News October 14, 2025

పెద్దపల్లి: ఆశా నోడల్ సూపర్వైజర్‌ల సమీక్ష సమావేశం

image

PDPL DMHO డా. వాణిశ్రీ అధ్యక్షతన ఆశా నోడల్ సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీను తొలి 3 నెలల్లోనే నమోదుచేసి, అన్ని పరీక్షలు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల వినియోగం, “102” వాహన సేవల ప్రాముఖ్యతను వివరించారు. క్షయ, మధుమేహం, రక్తపోటు స్క్రీనింగ్‌లు నిర్వహించి మందులు అందించాలన్నారు. సమావేశంలో CPR ప్రదర్శనతోపాటు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.

News October 14, 2025

SRCL: ‘బాలికల పురోగతికి సమాజం సహకరించాలి’

image

బాలికలు సురక్షితంగా, విద్యావంతులుగా, స్వయం సమర్థులుగా ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు (ఎఫ్‌ఏసీ) బి.పుష్పలత అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం సిరిసిల్ల సిటీలోని కుసుమరామయ్య ZPHSలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలికల హక్కులు, రక్షణ గురించి ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు.

News October 14, 2025

సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

image

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it