News September 22, 2025
NRPT: బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జిల్లాలో బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని, ఈ నెల 30న సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు.
Similar News
News September 23, 2025
వరంగల్: కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు యువకులు భవాని మాత మాలలను ధరించారు. మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతిరోజు అలంకరణలు చేయడానికి గాను యువకులు భవానిమాలలు వేసుకున్నారు. మంగళవారం గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
News September 23, 2025
గ్రీవెన్స్ డే సమస్యలు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

నల్గొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు మరింత కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 37 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News September 23, 2025
KNR: ఓపెన్ పదో తరగతి , ఇంటర్ పరిక్షలకు 82% హాజర్

కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 82% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు 37 మందికి గాను 32 మంది (91%), ఇంటర్ పరీక్షకు 73 మందికి గాను 58 మంది (79%) హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు నలుగురు హాజరయ్యారని వివరించారు.