News August 25, 2025
NRPT: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో బాల్య వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో బాలిక విద్యపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
Similar News
News August 26, 2025
జగిత్యాల: బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ

పోలీసులకు ఫిర్యాదు చేసే బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా 15 మంది అర్జీదారులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించి, న్యాయం జరిగేలా చూడటమే గ్రీవెన్స్ డే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
News August 26, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన పలువురి నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News August 26, 2025
తిమ్మాయపాలెంలో 22అడుగుల గణనాథుడు

బాపట్ల జిల్లాలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి అధిక మొత్తంలో ఖర్చైందని నిర్వాహకులు తెలిపారు. దీని ఖరీదు అక్షరాలా 1.5లక్షలు అన్నారు. ఈ విగ్రహాన్ని గ్రామంలోని ఓ యువకుడు అందజేశాడు. తొమ్మిది రోజుల ఈ పాటు వినాయకుడు పూజలందుకోనున్నారన్నారు.