News March 5, 2025

NRPT: బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లె లో వెలసిన శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు (బావోజి) బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఆలయ ఆవరణలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయంలో బావోజీని దర్శనం చేసుకొని పూజలు చేశారు.

Similar News

News December 21, 2025

INDWvsSLW: నేడు వైజాగ్‌లో తొలి T20

image

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో ఉన్న భారత్ ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. స్మృతి, హర్మన్‌, జెమీమా, దీప్తి, కమలిని, వైష్ణవి, రిచా ఘోష్‌, శ్రీచరణి వంటి ప్లేయర్లతో IND బలంగా ఉంది. అటు చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు కూడా సత్తా చాటాలనుకుంటోంది. 7PMకు మ్యాచ్ ఆరంభమవుతుంది. జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News December 21, 2025

MBNR: అన్నదాతల ఖాతాల్లోకి బోనస్ నిధులు..

image

MBNR జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ఆర్థిక ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 7,971 మంది రైతులు ఈ బోనస్‌కు అర్హత సాధించగా, డిఎం రవి నాయక్ వివరాలను వెల్లడించారు. ముందుగా 4000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయని, అనంతరం మిగిలిన రైతులకు జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News December 21, 2025

కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

image

TG: కన్హా శాంతివనంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా లక్ష మందితో వర్చువల్ ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం <>Meditationday.global/en<<>>లో రిజిస్టర్ అవ్వొచ్చన్నారు.