News July 5, 2025
NRPT: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NRPT(M) కోటకొండ వాసి అంజిలప్ప(32)కు ధన్వాడ(M) రాంకిష్టయ్యపల్లి వాసి రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు HYDలో ఉంటూ కూలి పనిచేస్తూ ఉండేవారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న హత్యచేసింది. కుటుంబసభ్యుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.
Similar News
News July 5, 2025
20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

AP: రాజధాని అమరావతిలో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు CRDA ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. పరిశ్రమలు రావాలంటే విమానాశ్రయం ఉండాలని, దాని కోసం 5వేల ఎకరాలు అవసరం అని తెలిపారు. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
News July 5, 2025
8న కేసముద్రం మున్సిపాలిటీకి డిప్యూటీ సీఎం, మంత్రుల రాక

ఈ నెల 8న కేసముద్రం మున్సిపాలిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సీతక్క, కొండా సురేఖ వస్తున్నట్లు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు. ఈ నెల 6న జరగాల్సిన సభ అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు రానున్న నేపథ్యంలో సభాస్థలి, ఏర్పాట్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
News July 5, 2025
మఠంపల్లి: కుర్రి శ్రీనివాస్ మృతి.. మంత్రి ఉత్తమ్ నివాళి

శ్రీనివాస్ అకాల మరణం పార్టీకి తీరని లోటు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం HYDలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సభలో పాల్గొని తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ మరణించిన విషయం తెలిసిందే. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.