News March 18, 2025
NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.
Similar News
News February 20, 2026
ADB: నాడు అక్బరుద్దీన్.. నేడు బాల్క సుమన్

జిల్లా జైలుకు మరోమారు రాష్ట్ర స్థాయి నేత రిమాండ్‌పై వచ్చారు. గతంలో ద్వేషపూరిత ప్రసంగాల కేసులో జనవరి 8 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ 40 రోజుల పాటు ఇక్కడ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక గొడవల నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు. అక్బరుద్దీన్ సుదీర్ఘ కాలం ఇక్కడ ఉండగా, సుమన్ ఎన్ని రోజులు ఉంటారోనని చర్చ మొదలైంది.
News February 20, 2026
బొబ్బిలి: గంజాయితో పట్టుబడ్డ విద్యార్థులు?

బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
News February 20, 2026
తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

తిరుమలలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు తణుకునకు చెందిన లక్ష్మీ,రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ, అశ్వినీలతో ఈ నెల 16న తిరుమల వచ్చారు. బాలికలు ఆడుకుంటూ ఉండగా అన్నమయ్య జిల్లాకు చెందిన గుండ్లూరు శివమ్మ వారిని అపహరించి తన వెంట తీసుకుపోయింది. తిరుమల పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించి 17న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని చిన్నారులను అప్పగించారు.


