News March 22, 2025
NRPT: భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి: కలెక్టర్

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉట్కూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో భూసేకరణను నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
వరంగల్‌లో హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి దామోదర

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం ఖండించారు. కేవలం భవనాలు కట్టి, జీవోలు ఇస్తే అభివృద్ధి కాదని.. ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, పూర్తిస్థాయి సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడమేనని స్పష్టం చేశారు. హరీశ్ రావు విమర్శలు అర్థరహితమని ఆయన మండిపడ్డారు.
News February 24, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓పాల్వంచ: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
✓లక్ష్మీదేవిపల్లి: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
✓భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
✓టేకులపల్లి సర్పంచ్ పై వార్డు సభ్యుల ఫిర్యాదు
✓ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్
✓టీవీవీపీ ఆసుపత్రుల్లో 9 వైద్య పోస్టుల భర్తీ: డీసీహెచ్ఎస్
✓కొత్తగూడెం: నేరాలకు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ
News February 24, 2026
మంథనిలో గరికపాటి ప్రవచనాలకు విశేష స్పందన

మంథని పట్టణంలో మంత్రపురి ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మ విలువలపై ఆయన చేసిన వివరణలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం మొత్తం భక్తిమయ వాతావరణంలో సాగింది.


