News February 4, 2025

NRPT: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News September 16, 2025

ADB: మేక గుండె ప్రదర్శన

image

మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సునీత విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధించారు. ఆమె స్వయంగా మేక గుండె, కిడ్నీలు తెచ్చి, వాటి నిర్మాణం, పనితీరును ప్రత్యక్షంగా వివరించారు. ఈ ప్రయోగాత్మక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అవగాహన భవిష్యత్తులో వైద్యులుగా రాణించే వారికి ఉపయోగపడుతుందని హెచ్‌ఎం శైలజ అభినందించారు.

News September 16, 2025

జగిత్యాల: ‘ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలి’

image

ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం మాల మహానాడు సమావేశం నిర్వహించారు. మాలల అస్థిరత్వంపై పోరాటం చేస్తూనే రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నవంబరు 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంజయ్య, రాజు, దేవయ్య, పురుషోత్తం పాల్గొన్నారు.

News September 16, 2025

ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.