News March 16, 2025
NRPT: ‘మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం’

మహిళలకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా షీ టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆకతాయిలు నుంచి మహిళలకు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గృహహింస, మానసికంగా వేధింపుల, అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
Similar News
News November 3, 2025
APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.
News November 3, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన, కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
ఆన్‌లైన్ పెట్టుబడి మోసం.. విశాఖకు చెందిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్‌రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీలు చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టించి నగదు కొట్టేశారు.


