News January 17, 2026
NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.
Similar News
News February 16, 2026
ఇలా అయితే ఆక్వా మనుగడ కష్టమే!(1/3)

ట్రేడర్ల చేతిలో, సిండికేట్ల చేతిలో నిలువునా దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు రాయితీలు కూడా అందని ద్రాక్షగానే మిగిలాయి. కనీసం ఫ్యాన్లు, ఏరియేటర్లు వంటి వాటిని కూడా రైతులకు రాయితీపై అందించడం లేదు. రూ.1.50 యూనిట్ విద్యుత్ ఛార్జ్ అని కేవలం అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పట్ల సాగు చేసే అందరి రైతులకు ఉపయోగపడటం లేదు. చెరువుల అనుమతుల విషయంలోనూ ప్రభుత్వాలు ఏమాత్రం రాయితీలు అందించిన పాపాన పోవడం లేదు.
News February 16, 2026
పెట్టుబడి ధరలు ఫుల్.. మద్దతు ధరలు నిల్..!(2/3)

ఆక్వా రైతులకు పెట్టుబడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫీడ్ తయారు చేసే సోయాబీన్ ధరలు తగ్గుముఖం పట్టినా రూ.60 వేలు ఉండే టన్ను ఫీడ్ ధర రూ. 90 వేలకు ఎగబాకింది. చెరువుల వద్ద ఏర్పాటు చేసే ట్రాన్సఫార్మర్ 40 కేవీ ధర 1.50 లక్షలు, 60 కేవీ ధర 2.50 లక్షలు గతంలో ఉండేది. ప్రస్తుతం అదే ట్రాన్సఫార్మర్ 60 కేవీ ధర రూ.5 లక్షలు అవుతుంది. ఇంతా భరించి పంట పండించినా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
News February 16, 2026
ప్రభుత్వ సాయం ఎక్కడ?(3/3)

ఈ పరిస్ధితుల్లో రైతులు ప్రతి దానికి సిండికేట్లను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం చెరువుల నీటి పరీక్షలకు కూడా ప్రైవేటునే రైతులు ఆశ్రయిస్తున్నారు. ఆకివీడులో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ల్యాబ్‌లో ఒక్క పరికరమూ పనిచేస్తున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.


