News March 7, 2025

NRPT: మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం

image

నారాయణపేట పట్టణ ప్రజలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని సింగారం కూడలిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.

Similar News

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

News September 18, 2025

బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

image

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News September 18, 2025

ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

image

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.