News December 12, 2025
NRPT: మొదటి దశ ఎన్నికల ఓటింగ్ వివరాలు ఇలా..!

నారాయణపేట జిల్లాలో మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో మద్దూరు మండలంలో 76.64%, కోస్గిలో 86.7%, అదేవిధంగా కొత్తపల్లిలో 82.07%, గుండుమాల్‌లో 83.06% నమోదైనట్లు అధికారులు తెలిపారు. నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 81.71% నమోదయింది. కొత్తపల్లిలో 12753, గుండుమాల్‌లో 15534, మద్దూర్‌లో 21597, కోస్గిలో 16805 నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 66,689 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News December 22, 2025
సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది: హరీశ్

TG: ఫోర్త్ సిటీ ఎందుకన్న <<18633868>>కేసీఆర్<<>> ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. ‘నిన్న చిట్ చాట్‌లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది రేవంత్. నీకు నీతి ఎక్కడుంది? రేపు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావు’ అని ఫైరయ్యారు.
News December 22, 2025
కామారెడ్డిలో ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ డా.కిరణ్మయి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బాధితులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ట్రైనీ కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 22, 2025
PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.


