News April 8, 2025

NRPT: మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ స్థాపనకు దరఖాస్తులు ఆహ్వానం

image

రాజీవ్ యువ వికాస్ పథకం కింద మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కామన్ సర్వీ మేనేజర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 70% నుంచి 80% ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ISBలో డీటీపీ, కంప్యూటర్ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఎంచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఎంపీడీవో అధికారిని సంప్రదించాలన్నారు.

Similar News

News April 8, 2025

అనకాపల్లి జిల్లాలో ‘గుండె’లు పిండేసిన ఘటన

image

బుచ్చయ్యపేట(M)బంగారుమెట్టులో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో సోమవారం మరణించారు. మేరుగు శ్రీను(28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మరణించాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న నక్కా లక్ష్మీనారాయణ(48) మధువాడ ఐటీ హిల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News April 8, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. నేడు రూ.7,355 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ. 50 ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ఎండాకాలం నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరకులు తీసుకొని రావాలని సూచిస్తున్నారు.

News April 8, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు

image

HYDలోని హైడ్రా కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా 57 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!