News February 4, 2025
NRPT: రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్‌ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 28, 2026
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.
News February 28, 2026
విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.
News February 28, 2026
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త!

AP: ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని APSDMA తెలిపింది. సెంట్రల్ ఆంధ్రలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీస్తాయంది. ఎండతీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. అలాగే వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచించింది.


