News October 22, 2025
NRPT: రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు మూసివేత

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దులోని కృష్ణ చెక్ పోస్టు మూసివేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి మేఘా గాంధి బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి చెక్ పోస్టు మూసివేసినట్లు తెలిపారు. చెక్పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్, రికార్డుకు కార్యాలయానికి చేర్చినట్లు చెప్పారు.
Similar News
News October 24, 2025
HYD: బస్సు ఘటన: హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

బెంగళూరు బస్సు ఘటనలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సహాయంగా TG ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్‌ను పర్యవేక్షించేందుకు ప్రోటోకాల్ శాఖ డైరెక్టర్‌కి బాధ్యతలు అప్పగిస్తూ అధికారులను నియమించింది.
ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ (ఫోన్: 9912919545),
ఇ.చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్ (ఫోన్: 9440854433).
ఈ హెల్ప్‌లైన్ ద్వారా బాధిత కుటుంబాలకు సమాచారం ఇస్తారు.
News October 24, 2025
KNR: స్లాట్ బుకింగ్స్ ప్రారంభం.. రూ.8,110 మద్దతు ధర

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈరోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంటను విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా ప్రభుత్వం రూ.8,110ల మద్దతు ధర ప్రకటించింది.
News October 24, 2025
కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలి: MP కావ్య

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రాజెక్టుల పురోగతిపై వరంగల్ కలెక్టర్ సత్యశారదదేవితో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమావేశం అయ్యారు. వరంగల్ జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ చేసి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.


