News April 5, 2025
NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.
Similar News
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News November 9, 2025
రూ.2 వేలు కడితే.. రూ.18,500 ఇస్తామని మెసేజ్‌లు

అమాయకులను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌లో కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రూ.2వేలు కట్టండి, రూ.18,500 జమ చేస్తాం అనే ఆఫర్‌తో మహిళలు, విద్యార్థులను గ్రూపుల్లో యాడ్ చేసి ఎర వేస్తున్నారు. చెల్లింపుల స్క్రీన్‌షాట్లు, పోలీసుల్లా మెసేజ్‌లు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మోసాలపై సైబర్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
News November 9, 2025
జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్‌ల వివరాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.


