News February 27, 2025

NRPT: రైతు అవగాహన సదస్సు.. పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

image

నారాయణపేట పట్టణ శివారులోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఇవాళ మ.1 గంటలకు జరిగే రైతు అవగాహన సదస్సులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్విధ జల ప్రక్రియ ద్వారా పంటల సాగు అనే అంశం పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Similar News

News September 17, 2025

దత్తతతో దేశం దాటి.. మూలాల కోసం మళ్లీ వచ్చింది..!

image

దత్తతతో దేశం దాటిన మహిళ తన తల్లిదండ్రుల మూలాల కోసం మళ్లీ తిరిగి మాతృ దేశానికి వచ్చింది. వరంగల్ శివనగర్‌లో తన మూలాలు ఉన్నాయని గుర్తించి చివరకు తన తల్లిదండ్రులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 36 ఏళ్ల క్రితం సంధ్యారాణి అనే మహిళ దత్తతతో స్వీడన్ దేశానికి వెళ్లింది. పెరిగి పెద్దై ఉన్నత చదువుల్లో రాణించి 2009 నుంచి అన్వేషించింది. చివరకు తనది పద్మశాలి సామాజిక వర్గమని తెలుసుకుంది.

News September 17, 2025

GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

image

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.

News September 17, 2025

వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

image

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.