News January 30, 2025
NRPT: లేగ దూడపై చిరుత దాడి

కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసి చంపింది. ఇదే గ్రామానికి చెందిన కాశప్ప లేగ దూడతో పాటు పశువులను బుధవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం వచ్చి చూడగా లేగ దూడ మృతి చెంది ఉంది. చిరుత పులి దాడి చేసి ఉంటుందని రైతులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి జాడ కనిపెట్టి బంధించాలని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.
Similar News
News July 5, 2025
అన్నమయ్య: అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి (M) రాయవరం గ్రామంలో కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శనివారం రాయచోటి రూరల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ఎదుట నిందితుడుని అదనపు ఎస్పీ వెంకటాద్రి తీసుకొచ్చారు. అతని నుంచి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News July 5, 2025
రాష్ట్రంలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు: పొంగులేటి

TG: రాష్ట్రంలో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025ను తీసుకువస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌తో చర్చించి విధి విధానాలు రూపొందించాక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ‘మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరిస్తాం. మహిళలకు, పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్ డ్యూటీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
News July 5, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.