News March 9, 2025

NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

image

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 9, 2025

GOOD NEWS.. చేనేత కార్మికులకు రుణమాఫీ

image

TG: చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష వరకు రుణమాఫీ కానుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న లోన్లకు ఇది వర్తించనుంది.

News March 9, 2025

సెలవు ఇవ్వలేదు.. సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చిన టీచర్

image

ఒడిశాలో ఒక ఉపాధ్యాయుడు సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చారు. ప్రకాశ్ భోయ్ అనే వ్యక్తి ఈనెల 6న తన తాత మరణించడంతో అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. సెలవు కావాలని కోరగా ప్రిన్సిపల్‌ నిరాకరించారు. దీంతో ప్రకాశ్ సెలైన్ బాటిల్‌తోనే విధులకు హాజరయ్యారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి పేర్కొన్నారు.

News March 9, 2025

కరీంనగర్: సీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం

image

కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా వచ్చారు.

error: Content is protected !!