News August 16, 2025

NRPT: వారణాసిలో ప్రొఫెసర్‌పై హత్యాయత్నం

image

బెనారస్ వర్సిటీ ప్రొ. శ్రీరామచంద్రమూర్తిపై హత్యాయత్నం కేసులో ఊట్కూరు(M) ఆవుసలోనిపల్లికి చెందిన భాస్కర్‌ని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. UP పోలీసుల వివరాలు.. వైస్ ఛాన్సలర్ పదవి కోసం ప్రొ.బూదాటి వెంకటేశ్వర్లు, ప్రొ.శ్రీరామచంద్రమూర్తి మధ్య పోటీ ఉంది. భాస్కర్‌కి ప్రొ.వెంకటేశ్వర్లు సుపారీ ఇచ్చి శ్రీరామచంద్రమూర్తిపై దాడి చేయించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరామచంద్రమూర్తి చికిత్స పొందుతున్నారు.

Similar News

News August 16, 2025

NGKL: జటాయువు పేరు మీద పుట్టిన జటప్రోలు

image

కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో ఉన్న మదనగోపాలస్వామి ఆలయం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోని గాలిగోపురం, శిల్పకళా నైపుణ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న జటప్రోలు-కొల్లాపూర్ సంస్థానాల నిర్మాణ శైలికి నిలువుటద్దం. జటాయువు పేరుమీద జటాయుపురమై, తర్వాత జటప్రోలు అన్న పేరు ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి.

News August 16, 2025

కడప జిల్లా యువకుడికి CGC మెడల్

image

పాకిస్థాన్‌కు చిక్కుకున్న మన దేశ జాలర్లను 2024 నవంబర్‌లో భారత నేవీ సిబ్బంది సాహసోపేతంగా రక్షించిన విషయం తెలిసిందే. ఆ నేవీ దళంలో కడప జిల్లా కలశపాడు మండలం కొండపేటకు చెందిన పాలకొలను నారాయణరెడ్డి, వీరమ్మ కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CGC(Conspicuous Gallantry Cross) మెడల్ అందించాలని ఆదేశించారు.

News August 16, 2025

కేసీఆర్ వద్దకు కవిత.. నిన్న ఏం జరిగిందంటే?

image

TG: తన చిన్న కుమారుడు ఆర్య చదువు కోసం US వెళ్తున్న తరుణంలో కవిత నిన్న KCRను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే కేసీఆర్-కవిత మాట్లాడుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా.. KCR ఆర్యను తన గదికి పిలిపించుకొని 10నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫాంహౌస్‌కు చేరుకున్న KTR, హరీశ్ రావు, ఇతర నేతలూ కవితతో మాట్లాడలేదని సమాచారం.